Library: చీకట్లో చదివించే గ్రంథాలయం!
‘మేం చదువుకునే రోజుల్లో ఇంట్లో విద్యుత్ ఏర్పాటు చేసుకునే స్థోమత లేక చీకట్లో కొవ్వొత్తులు పెట్టుకొని చదువుకునేవాళ్లం.. రాత్రయితే వీది దీపాల కింద కూర్చొని చదువుకునేవాళ్లం’ అని తాతలు, బామ్మలు చెబుతుంటారు. నిజమే.. ఇప్పుడంటే విద్యుత్ అందరికీ..
లోపలికెళితే విస్మయం!
ఇంటర్నెట్ డెస్క్: ‘మేం చదువుకునే రోజుల్లో ఇంట్లో విద్యుత్ ఏర్పాటు చేసుకునే స్థోమత లేక చీకట్లో కొవ్వొత్తులు పెట్టుకొని చదువుకునేవాళ్లం.. రాత్రయితే వీది దీపాల కింద కూర్చొని చదువుకునేవాళ్లం’ అని తాతలు, బామ్మలు చెబుతుంటారు. నిజమే.. ఇప్పుడంటే విద్యుత్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో రాత్రులు చీకట్లో చిన్నపాటి వెలుతురుతో ఎలా చదువుకునేవారో అనిపిస్తుంటుంది. అయితే, ఈ ఆలోచనే వచ్చినట్టుంది తైవాన్‌లోని ఓ బుక్‌షాపు యాజమాన్యానికి. తమ షాపును చిమ్మచీకటిగా మార్చి.. కేవలం పుస్తకాల వద్ద వెలుతురు వచ్చేలా నిర్వాహకులు చిన్నలైట్లను ఏర్పాట్లు చేశారు. బుక్‌షాపులందు తమ షాపు వేరయా.. అనిపించుకుంటున్నారు.
తైవాన్‌లోని కవొసింగ్ ప్రాంతంలోని ఫియర్-2 ఆర్ట్ సెంటర్‌లో ‘వుగాన్ బుక్స్’ అనే పుస్తకాల అంగడి ఉంది. ఈ షాపు లోపల మొత్తం చీకటి. అయితే, ఇందులో ఏర్పాటు చేసిన అరల్లో 400కుపైగా పుస్తకాలు ప్రదర్శనకు పెట్టారు. ఆ పుస్తకాల పైన చిన్న లైట్‌ను ఏర్పాటు చేశారు. దాని వెలుతురులో కేవలం పుస్తకంపై ఉన్న పేరు మాత్రమే కనిపిస్తుంటుంది. అలా అన్ని పుస్తకాలకు చిన్న లైట్లను ఏర్పాటు చేశారు. ఆ చీకట్లో పుస్తకాలను దూరం నుంచి చూస్తే అవి గాల్లో తేలుతున్నాయా?అన్నట్లుగా కనిపిస్తుంటాయి. అలాగే కొన్ని టేబుళ్లు.. వాటిపై తక్కువ వెలుతురు ఇచ్చే లైట్లను పెట్టారు. సందర్శకులు, కొనుగోలుదారులు ఈ చీకట్లోనే నడుస్తూ.. పుస్తకాలను తీసుకోవాలి. చదువుకోవాలనుకుంటే షాపు నిర్వాహకులు ఏర్పాటు చేసిన టేబుళ్ల వద్ద తక్కువ వెలుతురులో చదువుకోవచ్చు. సందర్శకులు, కొనుగోలుదారులు ఈ వినూత్న అనుభూతిని పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ షాపులో ఫోన్ టార్చ్‌లైట్ ఆన్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. భలే ఉంది కదా ఆలోచన..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు: మంత్రి కేటీఆర్
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అక్కడ టీమ్ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్
-
Movies News
Tollywood: విజయోత్సవం కాస్తా.. వివాదమైంది.. విమర్శల పాలైంది!
-
General News
sandoz: హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనున్న శాండోస్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: నెల్లూరు జిల్లాలో వైకాపా కోటకు బీటలు.. పార్టీకి దూరమవుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు