Covid Vaccine: వాళ్లకి ఇంటి వద్దే బూస్టర్‌ డోసు: జీహెచ్‌ఎంసీ

60 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి.. ఇంటి వద్దకే కరోనా వ్యాక్సిన్ సేవలు అందించాలని బల్దియా నిర్ణయించింది.

Published : 01 Feb 2022 13:52 IST

హైదరాబాద్‌: 60 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇంటి వద్దకే కరోనా వ్యాక్సిన్ సేవలు అందించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇప్పటి వరకూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోనివారు.. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్‌కు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి బూస్టర్ డోస్ వేస్తామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఒకటి కంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, పలు కారణాలతో బూస్టర్ డోస్ వేసుకోని వారు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 040 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. మొబైల్ వాహనం ద్వారా ఇంటికి వచ్చి వాక్సిన్‌ వేస్తారని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని