Andhra news: రావాల్సిన డబ్బులే అడుగుతుంటే.. కాకిలెక్కలు చెబుతున్నారు: బొప్పరాజు

ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. వచ్చే నెల 5న అన్ని ఉద్యోగ సంఘాలతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Published : 27 Mar 2023 15:33 IST

అమరావతి: ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. వచ్చే నెల 5న అన్ని ఉద్యోగ సంఘాలతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి  చట్టపరంగా రావాల్సిన డబ్బులనే తాము అడుగుతున్నామన్న ఆయన.. బకాయిలు  చెల్లించకుండా ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘మేం దాచుకున్న డబ్బులే కాకుండా మాకు చట్టపరంగా రావాల్సిన డబ్బుల్ని సైతం చెల్లించకుండా.. రిటైర్‌ అయినవాళ్లకు గానీ, మరణించిన వారికి గానీ బెనిఫిట్స్‌ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేం ఉద్యమం మొదలు పెట్టాం. మొన్న జరిగిన చర్చల్లో ఇప్పటికే రూ.3వేల కోట్లకు పైగా చెల్లింపులు చేశామని ప్రభుత్వం చెబుతోంది. మాటలు కాదు.. రాతపూర్వకంగా ఇవ్వండి. ఇంకా ఎంత పెండింగ్‌లో ఉంది? ఎంత చెల్లించారు? ఇంకా ఎంత ఇవ్వాలనేది రాతపూర్వకంగా ఇవ్వండని మేం ప్రభుత్వాన్ని అడిగాం. పీఆర్‌సీ ఎరియర్స్‌ను రిటైర్మెంట్‌ తర్వాత ఇస్తామని చెబుతూ ప్రభుత్వం ఇచ్చిన మెమోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పాం. 11వ పీఆర్సీలో పే స్కేల్‌ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఉద్యమం కొనసాగించాలని మేం నిర్ణయించాం. ఏప్రిల్‌ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నాయకత్వంతో, పలు శాఖలకు సంబంధించిన సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించుకొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాం’’అని బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని