Andhra News: అవినీతి ఏ వ్యవస్థలో లేదు?: బొప్పరాజు వెంకటేశ్వర్లు

సౌకర్యాల లేమితో పాటు వసతుల కొరతపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతోందని ప్రచారం చేయడమేంటని

Updated : 23 Apr 2022 14:20 IST

ఒంగోలు: సౌకర్యాల లేమితో పాటు వసతుల కొరతపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోతోందని ప్రచారం చేయడమేంటని ఆ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఏ వ్యవస్థలో లేదని ప్రశ్నించిన ఆయన కావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా ఉద్యోగులు శుద్ధంగా ఉండాలంటే ఎలా అని నిలదీశారు. అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఒంగోలులో బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు.

గుడివాడ ఘటన దురదృష్టకరమన్న బొప్పరాజు.. ఉద్యోగులపై భౌతిక దాడులు సరికాదన్నారు. సీపీఎస్‌ రద్దుపై ఈ నెల 25న ప్రభుత్వంతో జరిగే సమావేశంలో పీఆర్సీ జీవోల జారీ జాప్యంపై డిమాండ్‌ చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతిపై మమ్మల్ని దోషులుగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు, వసతులు లేకుండా పని చేస్తున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని