Bopparaju: నాలుగో దశ ఉద్యమం మా చేతుల్లో ఉండదు: బొప్పరాజు

ఉద్యోగ సంఘాల ఉద్యమాలతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసిందని.. కానీ ఆర్థికాంశాలతో ముడిపడిన డిమాండ్లు పరిష్కారం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Updated : 31 May 2023 14:07 IST

విజయవాడ: ఉద్యోగ సంఘాల ఉద్యమాలతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసిందని.. కానీ ఆర్థికాంశాలతో ముడిపడిన డిమాండ్లు పరిష్కారం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జూన్‌ 10లోపు ప్రభుత్వం స్పందించకుంటే నాలుగోదశ ఉద్యమం చేపడతామని చెప్పారు. జూన్‌ 8న గుంటూరులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి ప్రాంతీయ సదస్సు పోస్టర్లను ఆయన విడుదల చేశారు. 

గత 84 రోజులుగా తమ ఉద్యమం కొనసాగిస్తున్నామని.. దీన్ని చులకగా చూస్తే ప్రభుత్వానిదే తప్పు అని  బొప్పరాజు అన్నారు.  నాలుగో దశలో ఉద్యోగులు ప్రత్యక్షంగా పాల్గొంటారని.. అప్పుడు ఉద్యమం తమ చేతుల్లో ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎస్‌తో చర్చలకు గురువారం వెళ్తున్నట్లు తెలిపారు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు