Yadadri: యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యాదాద్రి మహాదివ్య క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. పాంచారాత్రాగమ విధానాలతో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.

Published : 21 Feb 2023 12:10 IST

యాదగిరిగుట్ట: యాదాద్రి మహాదివ్య క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. పాంచారాత్రాగమ విధానాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 11 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాలను విష్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విష్వక్సేన ఆరాధన, ఆలయ శుద్ధి పర్వాలను నిర్వహించారు.

పునర్‌ నిర్మితమైన ప్రధానాలయంలో బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే తొలిసారి. ఈ నెల 23 నుంచి అలంకారోత్సవాలు, 27న రాత్రి విశేష వేడుకలు ప్రారంభం కానున్నాయి. 28న రాత్రి తిరుకల్యాణ మహోత్సవం, మార్చి 1న రాత్రి దివ్య విమాన రథోత్సవం అనంతరం మార్చి 3న ఉత్సవాలు ముగియనున్నాయి. 28న రాత్రివేళ నిర్వహించే శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసే అవకాశముందని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని