మయూర వాహనంపై శ్రీశైలం మల్లన్న

శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఆదివారం తితిదే తరఫున ఈవో జవహార్‌రెడ్డి...

Updated : 07 Mar 2021 23:23 IST

తితిదే తరుపున పట్టువస్త్రాల సమర్పణ

శ్రీశైలం ఆలయం: శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు ఆదివారం తితిదే తరఫున ఈవో జవహార్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీభ్రమరాంబ-మల్లికార్జున స్వామి వార్లు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలతో పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులను గ్రామోత్సవానికి తీసుకొని వచ్చారు. ఉత్సవం ఎదుట కళాకారులు నృత్యాలతో సందడి చేశారు. భక్తజన శివనామస్మరణతో శ్రీగిరి పురవీధులలో స్వామి అమ్మవార్లకు వైభవంగా గ్రామోత్సవం జరిగింది. 

​​

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని