Brain Tumor: తరచుగా తలనొప్పి వస్తుందా..? అనుమానించాల్సిందే..!

కణితులు శరీరంలో ఎక్కడున్నా ప్రమాదమే..జీవ కణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పుట్టలు పోసినట్టు పెరిగితే ఇబ్బందికరమే. ఇక మెదడులో అలాంటి కణితులు ఏర్పడితే జీవన్మరణ సమస్యగా మారుతుంది. మృత్యువు మన కళ్లముందే కనిపిస్తుంది.

Published : 12 Aug 2022 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కణితులు శరీరంలో ఎక్కడున్నా ప్రమాదమే..జీవ కణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పుట్టలు పోసినట్టు పెరిగితే ఇబ్బందికరమే. ఇక మెదడులో అలాంటి కణితులు ఏర్పడితే జీవన్మరణ సమస్యగా మారుతుంది. మృత్యువు మన కళ్లముందే కనిపిస్తుంది. మెదడులో ఏర్పడే కణితుల అనుమానిత లక్షణాలు, నిర్థారణ పరీక్షల సాయంతో ముందుగానే తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

మెదడులో కణితుల సంకేతాలు ఇలా..!

* మెదడులో కణితులు ఏర్పడితే అవి ముదిరిపోయే దాకా గుర్తించలేరు.

* తరచుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంటుంది. వాంతులు కూడా అవుతాయి. ఈ లక్షణాలను చాలా సాధారణమైనవని అనుకుంటారు. వైద్యుల దగ్గరకు వెళ్లకుండా మందులను మింగేస్తారు.

* 20 ఏళ్ల వయసులో ఉన్నట్టుండి ఫిట్స్‌ వచ్చినట్లయితే మెదడులో సమస్య ఉన్నట్టేనని గుర్తించాలి.

* మాట స్పష్టత లోపించడం, ఎప్పుడూ మగతగా ఉండటం, అన్నం మింగడంలో ఇబ్బందిగా ఉంటుంది. 

* చూపులోనూ తేడా ఉంటే అనుమానించాల్సిందే. కొన్నిసార్లు పొర కమ్మేసినట్టు ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నపుడు వైద్యులను తొందరగా సంప్రదించాలి.

* మెదడులోని కణితులను తొలి దశలోనే గమనించినట్లయితే ఆధునిక వైద్యం సాయంతో వాటిని తొలగించడానికి వీలవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని