బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం

కరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్‌ కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో రికార్డుస్థాయిలో కొత్త మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధికంగా 4195 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది....

Published : 07 Apr 2021 14:22 IST

రియోడిజెనేరో: కరోనా వైరస్‌ బ్రెజిల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొవిడ్‌ కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉన్న బ్రెజిల్‌లో రికార్డుస్థాయిలో కొత్త మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో అత్యధికంగా 4195 మరణాలు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమెరికా, పెరూలో మాత్రమే ఇప్పటివరకు ఒక్కరోజులో నాలుగు వేల మరణాలు సంభవించాయి.

బ్రెజిల్‌లో ఇప్పటివరకు 1.31 కోట్ల మంది కొవిడ్‌ బారిన పడగా.. మహమ్మారి కాటుకు 3.37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంక్షలను సడలించడమే వైరస్‌ ఉద్ధృతికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న 90 శాతం ఐసీయూల్లో కొవిడ్‌ రోగులే చికిత్స పొందుతున్నారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా బ్రెజిల్‌లో 3 శాతం మంది ప్రజలు కొవిడ్‌ టీకాలు తీసుకున్నట్లు ప్రపంచ డేటా పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని