Brazilian Viper Venom: ఈ పాము విషంతో కరోనాకు మందు?
కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే గుణం కూడా ఓ పాము విషంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.....
సావో పాలో(బ్రెజిల్): ప్రాణం తీసే పాము విషాన్ని ఔషధంగా మారిస్తే అదే ప్రాణాలనూ నిలుపుతుంది. ఇప్పటికే పలు రకాల ఔషధాల తయారీలో కొన్ని సర్పాల విషాన్ని వినియోగిస్తున్నారు. తాజాగా కొవిడ్ మహమ్మారిని కట్టడి చేసే గుణం కూడా ఓ పాము విషంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాల్ని ‘మాలిక్యూల్స్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
బ్రెజిల్లో కనిపించే ఒక రకమైన రక్తపింజరి విషం కొవిడ్ చికిత్సలో ఉపయోగపడే అవకాశం ఉందని బ్రెజిల్‌లోని సావోపాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఈ పాము విషంలోని ఓ పదార్థం వైరస్ పునరుత్పత్తిని కోతిలో సమర్థంగా అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. దాదాపు 75 శాతం వరకు వైరస్ పునరుత్పత్తి నిలిచిపోయినట్లు తెలిపారు.
వైపర్ విషంలోని ఓ ‘పెప్టైడ్’.. కరోనా వైరస్ పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషించే ‘పీఎల్‌ప్రో’ అనే ఎంజైమ్‌కు అనుసంధానమవుతున్నట్లు ప్రొఫెసర్ రఫేల్ గైడో తెలిపారు. ఈ క్రమంలో ఇతర కణాలను ఈ పెప్టైడ్ ఏమాత్రం హాని చేయట్లేదని వివరించారు. యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్న ఈ పెప్టైడ్‌ను ప్రయోగశాలల్లోనూ ఉత్పత్తి చేయొచ్చని గైడో తెలిపారు. దీనికోసం అనవసరంగా ప్రకృతిలో ఉండే పాముల్ని హింసించాల్సిన అవసరం లేదన్నారు.
తర్వాతి దశ ప్రయోగాల్లో అసలు వైపర్ విషంలోని పదార్థానికి కరోనా వైరస్ కణాల్లోకి ప్రవేశించకుండా తొలి దశలోనే అడ్డుకునే సామర్థ్యం ఉందో.. లేదో.. తేల్చనున్నారు. అలాగే ఎంత డోసులో ఇస్తే ఆ పదార్థం ప్రభావవంతంగా పనిచేస్తుందో కూడా గుర్తించనున్నారు. జంతువులపై చేసే ఈ ప్రయోగాలన్నీ సఫలమైతే.. తర్వాతి దశలో మానవులపై కూడా వీటిని పరీక్షిస్తామని పరిశోధకులు తెలిపారు.
ఈ వైపర్ సర్పం శాస్త్రీయ నామం ‘జరరకుస్సు’. బ్రెజిల్లో కనిపించే అతిపెద్ద సర్పాల్లో ఇదొకటి. దీని పొడవు 2 మీటర్ల వరకు ఉంటుంది. బొలీవియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లోనూ ఈ పాములు కన్పిస్తుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్‌లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్