Tirumala: ఆ మూడు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు: తితిదే

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 24,25, నవంబర్‌ 8న బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) వెల్లడించింది. 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా బ్రేక్‌ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Published : 19 Oct 2022 12:47 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్‌ 24,25, నవంబర్‌ 8న బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) వెల్లడించింది. 24న దీపావళి ఆస్థానం, 25న సూర్యగ్రహణం, నవంబర్‌ 8న చంద్రగ్రహణం కారణంగా బ్రేక్‌ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

సూర్యగ్రహణం రోజున ఉద‌యం 8 నుంచి రాత్రి 7.30 గంట‌ల‌ వరకు, చంద్రగ్రహణం రోజున ఉద‌యం 8.30 నుంచి రాత్రి దాదాపు 7.30 వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసివేస్తారు. గ్రహణాల రోజుల్లో ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి సర్వదర్శన భక్తులను మాత్రమే తితిదే అనుమతించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని