TS News: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మాసం.. గులాబీ వెలుగుల్లో ‘రాజ్‌భవన్‌’

అక్టోబర్‌ నెల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన మాసం కావడంతో రాజ్‌భవన్‌ గులాబీ రంగులో వెలుగులీనింది. ఉషా లక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌........

Updated : 30 Sep 2021 21:59 IST

హైదరాబాద్‌: అక్టోబర్‌ నెల రొమ్ము క్యాన్సర్‌ (బ్రెస్ట్‌ క్యాన్సర్‌) అవగాహన మాసం కావడంతో రాజ్‌భవన్‌ గులాబీ రంగులో వెలుగులీనింది. ఉషా లక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌, బుద్ధ విగ్రహం, చార్మినార్‌ వంటి ప్రదేశాలు నేడు పింక్‌ రంగులో వెలుగుతాయని ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్‌ రఘురామ్‌ తెలిపారు. పింక్‌ రిబ్బన్‌ని బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహనకు వినియోగిస్తున్న నేపథ్యంలో చారిత్రక ప్రదేశాలను పింక్‌ రంగులో అలంకరించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేలా కృషిచేస్తున్నట్టు చెప్పారు. దీనిపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా ట్వీట్‌ చేశారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను హైదరాబాద్‌ చేరుకున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్‌ రఘురామ్‌తో కలిసి రాజ్‌భవన్‌ వద్ద వెలుగుల్లో తీసుకొన్న ఫొటోలను ఆమె షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని