వధువు మృతి.. ఆమె సోదరిని పెళ్లాడిన వరుడు

కుటుంబసభ్యులు.. అతిథుల మధ్య వైభవంగా వివాహవేడుక జరుగుతోంది. పెళ్లితంతులో భాగంగా వధువు.. వరుడు పూలదండలు మార్చుకున్నారు. ఆ వెంటనే వధువు కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అయితే, ఈ వివాహం ఆగకూడదని పెళ్లి పెద్దలు వరుడికి మృతురాలి సోదరిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Published : 30 May 2021 18:38 IST

లఖ్‌నవూ: కుటుంబసభ్యులు.. అతిథుల మధ్య వైభవంగా వివాహవేడుక జరుగుతోంది. పెళ్లితంతులో భాగంగా వధువు.. వరుడు పూలదండలు మార్చుకున్నారు. ఆ వెంటనే వధువు కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కాగా, ఈ వివాహం ఆగకూడదని పెళ్లి పెద్దలు వరుడికి మృతురాలి సోదరిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇటావా జిల్లా సనద్‌పూర్‌లో సురభి అనే అమ్మాయికి మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు చేశారు.పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడు పెళ్లిపీటలు ఎక్కి మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ, పూలదండలు మార్చుకున్న తర్వాత వధువు సురభి పెళ్లిపీటలమీదే పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వైద్యుడిని పిలిపించారు. వైద్యుడు ఆమెను పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు తెలిపాడు. ఈ పరిణామాంతో వివాహవేడుకలో విషాదం అలుముకుంది. అయితే, పెళ్లికి వచ్చిన బంధువులు, చేసిన ఖర్చు దృష్ట్యా వివాహం ఆగిపోకూడదని భావించిన ఇరు కుటుంబాలు.. వధువు సోదరిని మనోజ్‌కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాయి. దీంతో వధువు మృతదేహాన్ని ఒక గదిలో ఉంచి.. ఆమె సోదరితో వివాహం జరిపించారు. పెళ్లి మధ్యలో సోదరి మృతి చెందడంతో ఏం చేయాలో అర్థం కాలేదని, పెద్దల సూచనల మేరకు మరో సోదరిని వరుడికి ఇచ్చి వివాహం జరిపించామని సురభి సోదరుడు వాపోయాడు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని