ఆ కుటుంబానికి చట్టాలు వర్తించవు!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని ప్రతి దేశానికి ప్రత్యేకమైన రాజ్యాంగం.. చట్టాలున్నాయి. దేశ ప్రథమ పౌరుడి నుంచి సాధారణ వ్యక్తుల వరకూ అందరూ చట్టాలకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరూ వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా పదవి నుంచి తొలగించి శిక్షలు వేయొచ్చని చట్టంలోనే ఉంటుంది. కానీ, బ్రిటన్ రాయల్ కుటుంబం మాత్రం ఆ దేశ చట్టాలకు అతీతులు. కొన్ని అంశాల్లో బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె కుటుంబం చట్టాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. వారికి కొన్ని చట్టాలు అసలు వర్తించవు.
అరెస్టా.. అంటే
రాణి ఎలిజెబెత్‌కు యూకేపై సార్వభౌమాధికారాలు ఉన్నాయి. ఆమె నిర్ణయాలపైనే ప్రభుత్వ పాలన సాగుతుంది. కాబట్టి, రాణిపై ఆరోపణలు వచ్చినా.. నేరం చేసినట్టు తెలిసినా అరెస్టు చేసి విచారణ జరపడానికి వీల్లేదు. కేసులు, దర్యాప్తుల్లాంటివి ఏవీ వారికి వర్తించవు.
రిజిస్ట్రేషన్.. లైసెన్స్.. స్పీడ్
ఏ దేశంలోనైనా కార్లకు రిజిస్ట్రేషన్, వాహనచోదకులకు లైసెన్స్ తప్పనిసరి, ప్రాంతాన్ని బట్టి వాహనాల వేగానికి పరిమితి విధిస్తారు. బ్రిటన్ క్వీన్ ఎలిజెబెత్‌కు అవేవి అక్కర్లేదు. ఆమె వెళ్లే కారుకు రిజిస్ట్రేషన్ ఉండదు. వ్యక్తిగతంగా వాహనం నడపాల్సిన అవసరం క్వీన్‌కు ఎప్పుడూ రాలేదు. కాబట్టి లైసెన్స్ లేదు. ఒకవేళ నడిపినా.. ఆమె లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్వీన్‌తోపాటు, ఆమె కుటుంబసభ్యులు, ప్రధాన మంత్రి వెళ్లే వాహనాల వేగానికి పరిమితి ఉండదు. పోలీసులు, ప్రత్యేక సిబ్బంది వారి వాహనాలను ఎంత వేగంగానైనా.. ఎంత నెమ్మదిగానైనా నడపొచ్చు.
పాస్పోర్టుతో పనిలేదు
బ్రిటన్ పౌరులకు జారీ చేసే పాస్‌పోర్టులు రాణి ఎలిజెబెత్ పేరుతోనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తికి పాస్పోర్టుతో పనేముంది చెప్పండి. క్వీన్ పాస్‌పోర్టు లేకుండానే ఏ దేశానికైనా వెళ్లే అధికారముంది. అయితే ఆమె కుటుంబసభ్యులకు మాత్రం పాస్‌పోర్టు ఉండాల్సిందే.
టాక్స్ కట్టక్కర్లేదు
క్వీన్ ఎలిజెబెత్‌కు దేశ పాలనతో పాటు ఎన్నైనా వ్యాపారాలు ఉండొచ్చు.. ఆదాయం రావొచ్చు. కానీ, ఆమెకు చట్టాల ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, క్వీన్ స్వచ్ఛందంగా ఆదాయపు పన్ను కట్టడం విశేషం. క్వీన్‌తోపాటు ఆమె కుటుంబసభ్యులకు కూడా ఆదాయం పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెల్లదు
మన దగ్గర ఉన్న రైట్ టు ఇన్ఫర్మేషన్‌నే బ్రిటన్‌లో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని పిలుస్తారు. దరఖాస్తు ద్వారా ఎలాంటి వివరాలైనా పొందే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. కానీ, రాయల్ కుటుంబంలో జరిగే విషయాలన్నీ వారి వ్యక్తిగతం. వాటిని ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద బహిర్గత పర్చలేరు. క్వీన్ కుటుంబానికి వ్యక్తిగత స్వేచ్ఛను ఇవ్వడం కోసమే ఈ చట్టంలో మినహాయింపు కల్పించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
social look: ‘మిస్బి’గా తమన్నా.. నిఖిల్ రిక్వెస్ట్.. శునకానికి సోనూ ట్రైనింగ్..
-
India News
DGCA: విమానాలకు పక్షుల ముప్పు! డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు జారీ
-
Politics News
KTR: ఉచిత పథకాలన్నీ రద్దు చేసి వచ్చే ఎన్నికలకు వెళ్తారా?: మోదీని ప్రశ్నించిన కేటీఆర్
-
India News
Space: భారత్‌కు అంతరిక్షం నుంచి సందేశం..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు