Harish rao: మూడు మెడికల్‌ కళాశాలలున్న నగరం.. వరంగల్‌: హరీశ్‌రావు

తెలంగాణలో 60 ఏళ్లలో 3 ప్రభుత్వ కళాశాలలు ఉంటే.. కేవలం 9 ఏళ్లలోనే ఆస్పత్రుల సంఖ్య 21కి చేరిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్‌ పట్టణంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్యటించారు.

Published : 31 May 2023 18:26 IST

వరంగల్: తెలంగాణలో 60 ఏళ్లలో 3 ప్రభుత్వ కళాశాలలు ఉంటే.. కేవలం 9 ఏళ్లలోనే ఆస్పత్రుల సంఖ్య 21కి చేరిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరంగల్‌ పట్టణంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్యటించారు. హంటర్‌రోడ్డులోని ప్రైవేటు వైద్య కళాశాలను మంత్రులు ప్రారంభించారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్‌నూ వారు ప్రారంభించారు. నాడు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 20 వైద్య కళాశాలలు ఉండేవని.. నేడు అవి 55కు చేరాయన్నారు. ఎంబీబీఎస్‌ సీట్లు 2,950 నుంచి 8,340కి పెరిగాయన్నారు. ఇప్పుడు 3 మెడికల్‌ కళాశాలలున్న నగరంగా వరంగల్‌ అవతరించిందని పేర్కొన్నారు. రూ.1100 కోట్లతో హెల్త్‌ సిటీ నిర్మాణం జరుగుతోందని హరీశ్‌రావు వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని