Protest: గేదెతో నిరసన.. ఊహించని పరిణామం

గేదెతో నిరసన చేపట్టాలను భావించిన ప్రైవేటు ఉపాధ్యాయ యాజమాన్యాలకు చుక్కెదురైంది. నిరసన కోసం తీసుకొచ్చిన ఓ గేదె ఊహించని రీతిలో అక్కడ విధ్వంసం సృష్టించింది....

Updated : 04 Jul 2021 13:34 IST

భోపాల్‌: గేదెతో నిరసన చేపట్టాలని భావించిన ప్రైవేటు ఉపాధ్యాయ యాజమాన్యాలకు చుక్కెదురైంది. నిరసన కోసం తీసుకొచ్చిన ఓ గేదె ఊహించని రీతిలో అక్కడ విధ్వంసం సృష్టించింది. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి.

కరోనా విజృంభణ కారణంగా గతేడాది మార్చిలో పాఠశాలలను మూసివేశారు. అప్పటి నుంచి మళ్లీ స్కూళ్లను ప్రారంభించలేదు. కొవిడ్‌ కేసులు తగ్గుతున్న నేపథ్యంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు షాజాపూర్‌లో నిరసనకు దిగాయి. 

ఈ నిరసనల్లో భాగంగా వారు ఓ గేదెను తీసుకొచ్చారు. అయితే అక్కడి పరిస్థితులు క్షణాల్లో మారిపోయాయి. నిరసనకారులు దాని చుట్టూ చేరడం, అక్కడి హడావుడి చూసి భయాందోళనకు గురైన గేదె.. తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఓ మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని