Stalin: మహిళను బస్సులో నుంచి దింపేసిన కండక్టర్‌.. సీఎం ఆగ్రహం!

ఓ మహిళల వద్ద చేపల వాసన వస్తుందని ఆమెను కండక్టర్‌ బస్సులో నుంచి నిర్ధాక్షణ్యంగా దింపేశాడు. దీంతో ఆ కండక్టర్‌పై తమిళనాడు సీఎం ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాష్ట్ర ఆర్టీసీ అధికారులు అతడితోపాటు.. బస్సు డ్రైవర్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది

Published : 08 Dec 2021 16:21 IST

చెన్నై: ఓ మహిళల వద్ద చేపల వాసన వస్తుందని కండక్టర్‌ ఆమెను బస్సులో నుంచి నిర్ధాక్షిణ్యంగా దింపేశాడు. దీంతో ఆ కండక్టర్‌పై తమిళనాడు సీఎం ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాష్ట్ర ఆర్టీసీ అధికారులు అతడితోపాటు.. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కన్యాకుమారి జిల్లాలోని కోలాచెల్‌ బస్టాండ్‌ వద్ద ఓ మహిళ బస్‌ ఎక్కింది. అయితే, ఆమె వద్ద చేపల వాసన రావడంతో కండక్టర్‌ ఆమెను బస్‌లో నుంచి దింపేశాడు. దీంతో అతడిపై ఆమె మండిపడుతూ.. ఆర్టీసీ సిబ్బంది తనపై వివక్ష చూపుతున్నారని, తనకు న్యాయం చేయాలని బస్టాండ్‌లోనే ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ కాగా.. అది కాస్త సీఎం ఎం.కే. స్టాలిన్‌ దృష్టికి వెళ్లింది. కండక్టర్‌ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తోన్న ఈ తరుణంలో ఓ కండక్టర్ చేసిన ఈ చర్య గర్హనీయం. అందరం సమానమే అనే విశాల దృక్పథంతో మనమందరం ఆలోచించి పనిచేయాలి’అని ట్వీట్‌ చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ ఘటనపై స్పందించడంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తమై బస్సు కండక్టర్‌తోపాటు డ్రైవర్‌ని కూడా సస్పెండ్‌ చేశారు. రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు బాధితురాలి వద్దకు వెళ్లి క్షమాపణ తెలిపారు. 

Read latest General News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని