TS News: అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌

Published : 17 Jan 2022 20:28 IST

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు బీఎస్సీ(ఫారెస్ట్రీ) కోర్సు చదివిన వారికి అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఉద్యోగాల్లో 25%, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ విభాగంలో 50%, ఫారెస్టర్స్‌ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. రిజర్వేషన్లకు అనుకూలంగా సర్వీసు రూల్స్‌ సవరణకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని ములుగు ఎఫ్‌సీఆర్‌ఐలో బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్ల కోర్సు అందుబాటులో ఉంది. మరోవైపు మహిళా వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని