CM Kcr: కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం.. రెండ్రోజుల్లో విధివిధానాలు: సీఎం కేసీఆర్‌

తెలంగాణలోని బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయానికి సంబంధించి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లో ఖరారు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్.. విధివిధానాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తును వివరించారు..

Published : 29 May 2023 22:07 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయానికి సంబంధించి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లో ఖరారు చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్.. విధివిధానాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తును వివరించారు. రెండు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.

కులవృత్తులకు చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. కులవృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీబ్రాహ్మణ, పూసల, బుడగజంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. లక్ష రూపాయల చొప్పున దశల వారీగా ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరితగతిన విధివిధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలని మంత్రి గంగుల కమలాకర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. అంతకుముందు మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మరోమారు సమావేశమైంది. మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అధికారులు సమావేశమై సంబంధిత అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని