CAG: రూ.6,356 కోట్లు మురిగిపోయాయి: ఏపీ ఆర్థికస్థితిపై కాగ్ నివేదిక
ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించింది. 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్ కార్యాలయం అందజేసింది.
అమరావతి: ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించింది. 2022 మార్చి 31 తేదీతో ముగిసిన సంవత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్ కార్యాలయం అందజేసింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రెవెన్యూ, రవాణా తదితర అంశాలపై నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ మురిగిపోయిందని.. గత ఏడాదితో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు రూ.24,257 కోట్ల మేర పెరిగాయని పేర్కొంది.
‘‘బడ్జెటేతర రుణాలు రూ.1,18,394 కోట్లు నమోదయ్యాయి. డిస్కమ్‌లు, నీటిపారుదల ప్రాజెక్టులకు చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.17,804 కోట్లు ఉన్నాయి. వీటినీ బడ్జెట్‌లో చూపకపోవడంతో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన నిధులపై శాసనసభ నియంత్రణ కోల్పోయేందుకు కారణమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 18.47 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు నమోదు చేసింది. 2021లో ఏపీ ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని సవరించింది. తద్వారా ఆర్థిక రుణ పరిమితి పెంచుకునే ప్రయత్నం జరిగింది. రూ.688 కోట్ల రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయమని తప్పుగా వర్గీకరించారు.
నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకాన్ని మూలధన వ్యయంగా ప్రభుత్వం చూపింది. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల స్థలాలు, ఇళ్లను రెవెన్యూ వ్యయంగా చూపాల్సి ఉంది. బడ్జెట్‌లో చూపని అదనపు రుణాలు పరిమితి కంటే అధికంగా ఉన్నాయి. స్మార్ట్ పట్టణాలు, కృషి వికాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ లాంటి పథకాలకు రాష్ట్ర వాటా విడుదల కాకపోవటం వల్ల అవి సరిగా అమలు కాలేదు. రూ.3540 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా రాష్ట్రం వివిధ పథకాలకు తన వాటా విడుదల చేయలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కేపిటల్ వ్యయం తక్కువగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.3,72,503 కోట్లు. దీనిలో 90 శాతం మేర రుణాలు 13.99 శాతం వడ్డీ తో తీసుకున్నవే. 2018 నుంచి 2022 వరకూ అంతర్గత రుణాలు 77.54 శాతం మేర పెరిగాయి. గడచిన ఐదేళ్లలో తలసరి రుణం 61 శాతం మేర పెరిగింది. బడ్జెటేతర రుణాలు కూడా కలిపితే తలసరి రుణ భారం రూ.92,797గా నమోదైంది’’ అని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
జపాన్‌లో జన సంక్షోభం.. రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు!
-
Crime News
Train accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. ఏపీలో హెల్ప్‌లైన్ నంబర్లు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
India News
Train Accident: రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
India News
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అధికారుల బదిలీలపై ఈసీ కీలక ఆదేశాలు