Health: దంపతులకు హెచ్‌ఐవీ ఉంటే పిల్లలకు వస్తుందా

ప్రచారం ప్రజల దరికి చేరడంతో ఎయిడ్స్‌, హెచ్‌ఐవీ మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. కేసులు గణనీయంగా నియంత్రణలోకి వచ్చాయి. 

Updated : 31 Oct 2023 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రచారం ప్రజల దరికి చేరడంతో ఎయిడ్స్‌, హెచ్‌ఐవీ మరణాలు చాలా వరకు తగ్గిపోయాయి. కేసులు గణనీయంగా నియంత్రణలోకి వచ్చాయి. అయినా కొంతమందిలో ఇంకా అనుమానాలున్నాయి. దంపతులకు హెచ్‌ఐవీ ఉంటే పిల్లలకు వస్తుందా..? అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సందేహాలతో సతమతవుతుంటారు. హెచ్‌ఐవీపై అనుమానాలు, అపోహలు చీఫ్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు చెప్పిన వివరాలు..

మరణాలెందుకు సంభవిస్తాయి: మన దగ్గర అపోహలు పెరిగినంత తొందరగా వాస్తవాలు ప్రచారం కావడం లేదు. నమ్మకమైన వారి సలహాలు తీసుకోవడం, ప్రభుత్వ కేంద్రాల్లో వైద్యం తీసుకోవాలి. నాకేం కాదని కూర్చొంటే మాత్రం మరణాలు సంభివిస్తున్నాయి. 

పెళ్లి చేసుకోవచ్చా: ఆడ, మగ ఇద్దరికి హెచ్ఐవీ పాజిటీవ్‌ అయితే చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలను కూడా కనొచ్చు. హెచ్‌ఐవీ వైరస్‌ జీరోలోడ్‌కు వచ్చేలా మందులతో బాగు చేయడానికి వీలుంది. అప్పుడు పిల్లలను కంటే వాళ్లకు నెగెటివ్‌ వస్తుంది. భర్త ఎప్పుడైనా కండొమ్‌ వాడాల్సిందే. లేకపోతే వైరస్‌లో కొత్త శక్తి చేరి వేసుకునే మందు పని చేయదు. 

పూర్తిగా నయం చేయొచ్చా: హెచ్‌ఐవీ ఉన్నవారు సరయిన మందులు వాడినట్లయితే పూర్తిగా నయం చేయడానికి వీలుంది. కొన్ని దేశాల్లో నెగెటివ్‌ అయినట్టు తెలుస్తున్నా, మన దేశంలో ప్రస్తుతమైతే స్పష్టత లేదు. 

రోజూ మందులు వాడాల్సిందేనా: 2020లో ఒక ఇంజక్షన్‌కు అనుమతి వచ్చింది. ఒక ఇంజక్షన్‌ వేయించుకుంటే 3-6 నెలల వరకు మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల ఇంప్లాంట్‌ ఒకటి వచ్చింది. దాన్ని వేసుకుంటే రెండేళ్ల వరకు మందులు వాడాల్సిన అవసరం లేదు.

హెచ్‌ఐవీకి టీకా వస్తుందా: హెచ్‌ఐవీలో ముటేషన్లు చాలా తయారయ్యాయి. వ్యాక్సిన్‌ తయారయ్యింది. కానీ అమలు కాలేదు. న్యూయార్క్‌లో పరిశోధనలు మొదలెట్టి ఆపేశారు. వైరస్‌ తరచూ రూపాంతరం చెందడంతో వ్యాక్సిన్‌ పనిచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తొందరలోనైతే టీకా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని