Health: పెద్ద పేగులో క్యాన్సర్‌ ఉంటే.. ఇలా కనిపెట్టవచ్చు...!

పేరుకే పెద్దపేగు దాని ప్రాధాన్యం పెద్దదే కానీ ఇది జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాముఖ్యం అంతాఇంతా కాదు.

Published : 24 Jun 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెద్దపేగు దాని ప్రాధాన్యం పెద్దదే కానీ ఇది జీర్ణ వ్యవస్థలో ఎక్కడో ఉంటుంది. అయినా పెద్ద పేగు ప్రాముఖ్యం అంతాఇంతా కాదు. సాధారణ నీళ్ల విరేచనాలు మొదలుకొని ప్రమాదకర క్యాన్సర్ల వరకు ఎన్నో సమస్యలు పెద్ద పేగులో కనిపిస్తాయి. ఇందులో వచ్చే వ్యాధులను ముందుగానే ఎలా పసిగట్టాలి. చికిత్స ఎలా చేయించుకోవాలి. పెద్దపేగులో క్యాన్సర్‌ వస్తే ముందుగానే తెలుసుకోవడానికి వీలుందా...? ఈ అనుమానాల గురించి వైద్యులు పలు విషయాలు తెలిపారు.

* పెద్ద పేగులో కనిపించే అతి పెద్ద విపత్తు క్యాన్సర్‌. ఈ వ్యాధితో ఏటా వేలాది మంది చనిపోతున్నారు.

* ఏ మాత్రం అనుమానం ఉన్నా కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్థారణ చేసుకోవడానికి వీలవుతుంది.

* 50 ఏళ్లు దాటిన తర్వాత విసర్జనలో మార్పులుంటే అనుమానించాలి. మల విసర్జనలో రక్తం పడుతున్నా. మలబద్ధకం తీవ్రంగా ఉన్నా ఆగకుండా నీళ్ల విరేచనాలు అవుతున్నా, తరచుగా కడుపులో నొప్పి ఉన్నపుడు వైద్యులను సంప్రదించాల్సిందే.

* మల విసర్జనకు వెళ్లినా ఇంకా మళ్లీ వెళ్లాలని అనిపించడం, క్రమంగా బరువు తగ్గడంతో వైద్యుల వద్దకు వెళ్లాలి. 

* గతంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొలనోస్కోపీ చేయించాలి. ఇది పెద్ద పేగులో క్యాన్సర్‌ ఉందో లేదో తేల్చుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని