Indian Railway: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఘటన.. పలు రైళ్లు రద్దు: దక్షిణ మధ్య రైల్వే

గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated : 15 Feb 2023 11:07 IST

హైదరాబాద్‌: బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్‌(12727) పట్టాలు తప్పిన నేపథ్యంలో నేడు 7 రైళ్లు పూర్తిగా.. 12 పాక్షికంగా రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ప్రకటించారు.

బుధవారం ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా బీబీనగర్‌ సమీపంలోని అంకుషాపూర్‌ వద్ద పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు ట్రాక్‌ నుంచి పక్కకు జరిగాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాక్‌ మరమ్మతుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

రద్దయిన రైళ్ల వివరాలివే..

కాచిగూడ-నడికుడి (07791)

నడికుడి-కాచిగూడ (07792)

సికింద్రాబాద్‌-వరంగల్‌ (07462)

వరంగల్‌-హైదరాబాద్‌ (07463)

సికింద్రాబాద్‌-గుంటూరు (12706)

గుంటూరు-సికింద్రాబాద్‌ (12705)

సికింద్రాబాద్‌-రేపల్లె (17645)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని