
Strange Addictions: ఎక్కడికెళ్లినా భర్త చితాభస్మంతోనే.. అప్పుడప్పుడు రుచి చూడాల్సిందే!
ఇంటర్నెట్ డెస్క్: మనకు ఇష్టమైనవారు.. జీవిత భాగస్వామి.. ఇలా ఎవరైనా మననుంచి శాశ్వతంగా దూరమైతే ఆ బాధ భరించలేనిది! ఈ క్రమంలో కొందరు.. మరణించినవారి జ్ఞాపకాలకు గుర్తుగా స్మారకాలు నిర్మించడమో, వారి విగ్రహాలను తయారు చేయించి పూజించడమో చేస్తుంటారు. కానీ.. యూకేకు చెందిన ఓ 26 ఏళ్ల మహిళ మాత్రం అసాధారణంగా ప్రవర్తిస్తున్నారు. చనిపోయిన తన భర్త చితాభస్మాన్ని వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. అంతటితో ఆగకుండా.. అప్పుడప్పుడు దాన్ని తింటుండటం గమనార్హం.
తోటివారు షాక్!
యూకేకు చెందిన కాసీకి, సీన్‌కు 2009లో పెళ్లయింది. అన్యోన్యంగా ఉంటున్న ఈ జంటను విధి వెక్కిరించింది. కొన్నాళ్ల క్రితం అస్తమా బారినపడి సీన్ కన్నుమూశాడు. భర్త అంత్యక్రియలు నిర్వహించిన కాసీ.. అప్పటినుంచి అతని చితాభస్మాన్ని తనతోపాటు ప్రతిచోటా తీసుకెళ్లడం ప్రారంభించారు. షాపింగ్‌కు, సినిమాకు, హోటళ్లకు ఇలా.. ఎక్కడికెళ్లినా వెంట ఉండాల్సిందే. అయితే.. ఇదంతా సాధారణమేనని భావించే తోటివారు.. ఆమె ఆ చితాభస్మాన్ని కొద్దికొద్దిగా తింటుండటం చూసి షాక్‌కు గురవుతున్నారు! ఈ విషయాన్ని ఆమె సైతం అంగీకరించారు.
‘తింటున్న కొద్దీ ఉత్సాహం’
‘నా భర్త నుంచి దూరం కావలడనుకోవడంలేదు. కాబట్టే ఇలా చేస్తున్నాను. రెండు నెలలవుతున్నా దీన్ని మానుకోలేకపోతున్నా’ అని పేర్కొంటున్నారు. మొదట్లో చితాభస్మం వాసన కుళ్లిన గుడ్ల మాదిరి వచ్చేదని, ఇప్పుడు అలవాటు అయిందని చెబుతుండటం గమనార్హం. ‘చితాభస్మం డబ్బా తెరిచినప్పుడల్లా ఆనందం కలుగుతుందని, దాన్ని తింటున్న కొద్దీ మరింత ఉత్సాహం కలుగుతుందని ఆమె వివరిస్తున్నారు. ఆమె ఈ అలవాటును స్థానికంగా ‘ప్రజల వింత వ్యసనాల’పై రూపొందించిన ఒక కార్యక్రమంలోనూ ప్రదర్శించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.