Hyderabad: నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారుపై పడిన ఇనుపకడ్డీ.. తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ వాహనదారుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి ఇనుపకడ్డీ..

Published : 07 Dec 2021 19:34 IST

హైదరాబాద్: హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ వాహనదారుడికి త్రుటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి ఇనుపకడ్డీ.. అతడి కారుపై పడింది. దీంతో కారు ముందుభాగం ధ్వంసమవగా.. ఏం జరిగిందో అర్ధంకాక వాహనదారుడు వణికిపోయాడు. గచ్చిబౌలి-కొండాపూర్ మార్గంలోని వంతెన వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలాంటి జాగ్రత్తలూ పాటించకుండా వంతెన నిర్మాణ పనులు చేస్తున్నారంటూ కారు యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టానికి గుత్తేదారు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారుడు కోరారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని