Car Parking: ఆ నగరంలో కారు పార్కింగ్‌కు ₹6 కోట్లు పెట్టాల్సిందే!

మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ను దాటుకుని గమ్యాన్ని చేరుకోవడం ఎంత కష్టమో, కారు పార్క్‌ చేసేందుకు స్థలం దొరకడం అంతకంటే పెద్ద సవాల్‌.

Published : 25 Nov 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ను దాటుకుని గమ్యాన్ని చేరుకోవడం ఎంత కష్టమో, కారు పార్క్‌ చేసేందుకు స్థలం దొరకడం అంతకంటే పెద్ద సవాల్‌. అందుకే ఉచితంగా అందించాల్సిన పార్కింగ్‌కు  కార్పొరేట్ కార్యాలయాలు, వ్యాపార సముదాలు, షాపింగ్‌ మాల్స్‌ ప్రత్యేక రుసుమును వసూలు చేస్తుంటాయి. ఈ రుసుము నగరాన్ని, నగరంలోని ప్రాంతాల్లో ఉన్న రద్దీని బట్టి మారుతుంటుంది. కానీ, అమెరికాలోని ఖరీదైన నగరంగా పేర్కొనే న్యూయార్క్‌లో పార్కింగ్ స్థలం కోసం చెల్లించాల్సిన ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఇటీవలే 16 మిలియన్‌ డాలర్ల ఖరీదైన అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్ సముదాయం ఏడున్నర లక్షల డాలర్లకు అమ్ముడైనట్లు సీఎన్‌బీసీ ఓ కథనంలో పేర్కొంది. అంటే దాదాపు రూ.ఆరు కోట్ల రూపాయలు. అయితే, ఈ ఖరీదు నేల మీద పార్కింగ్ చేసేందుకు కాదు. కార్లను పైకి లిఫ్ట్‌ చేసి క్యాబిన్‌లలో ఉంచే ఆటోమేటిక్‌ పార్కింగ్ సిస్టమ్‌కు ఇంత భారీగా చెల్లించినట్లు సమాచారం. నగరంలోని ఖరీదైన నివాస ప్రాంతాల్లో అయితే, కారు పార్కింగ్‌ కోసం సుమారు ఐదు లక్షల డాలర్ల నుంచి ఆరు లక్షల డాలర్ల వరకు చెల్లించాలని సీఎన్‌బీసీ ఒక కథనంలో పేర్కొంది. అంటే, సుమారు రూ.మూడు కోట్ల నుంచి రూ. ఐదు కోట్లన్నమాట.

ఇకపోతే, సాధారణ ప్రదేశాల్లో కారు పార్కింగ్ కోసం కనీస ధర మూడు లక్షల డాలర్లుగా ఉన్నట్లు న్యూయార్క్‌కు చెందిన రియల్‌ ఎస్టేస్‌ సంస్థ తెలిపింది. ఈ పరిస్థితికి నగరంలో విపరీతంగా పెరుగుతోన్న కార్ల సంఖ్యే కారణమని పేర్కొంది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం న్యూయార్క్‌లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కార్ల సంఖ్య 224 శాతం మేర పెరిగింది. దీంతో ఇళ్ల ధరలతోపాటు కారు పార్కింగ్‌ ధరలు పోటీపడుతున్నాయని తెలిపింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని