Viral video: కారును మింగేసిన నీటి గుంత..!

పడవలను సుడిగుండం తనలో కలిపేసుకున్నట్లు.. పేద్ద అనకొండ ఓ చిన్న ప్రాణిని లోపలికి మింగేసినట్లు.. ఓ కారును నీటి గుంత భూమిలోకి అమాంతం లోపలిక....

Updated : 13 Jun 2021 18:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పడవలను సుడిగుండం తనలో కలిపేసుకున్నట్లు.. పెద్ద అనకొండ ఓ చిన్న ప్రాణిని లోపలికి మింగేసినట్లు.. ఓ కారును నీటి గుంత అమాంతం లోపలికి లాగేసుకుంది. దీంతో పార్కింగ్‌లో ఉంచిన కారు కొద్ది క్షణాల్లోనే మాయమైపోయింది. ఈ ఘటన ముంబయిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబయిలోని ఘట్కోపర్‌ వెస్ట్‌ ప్రాంతంలో కామా లేన్‌ వద్ద నివాస సముదాయం ఉంది. అక్కడి హౌసింగ్‌ సొసైటీ బావిని కాంక్రీట్‌తో పూడ్చారు. దానిపై స్థానికులు కార్లు నిలిపి ఉంచుతున్నారు. గత కొద్ది రోజులుగా ముంబయిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ కాంక్రీటు భాగం కుంగింది. దీంతో దానిపైన పార్క్‌చేసిన కారు కొద్ది క్షణాల్లోనే నీటి గుంతలో జారుకుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది. పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు అనంతరం కారును బయటికి తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని