అగ్నిపర్వతం విస్ఫోటనం.. ప్రజలు విలవిల

తూర్పు కరేబియన్‌ ద్వీపం సెయింట్‌ విన్సెంట్‌లోని లాసోఫియర్‌ అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం విస్పోటనం చెందగా ఆ ప్రాంతం మొత్తం బూడిదమయంగా మారింది....

Published : 21 Apr 2021 00:23 IST

సెయింట్‌ విన్సెంట్‌: తూర్పు కరేబియన్‌ ద్వీపం సెయింట్‌ విన్సెంట్‌లోని లాసోఫియర్‌ అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందగా ఆ ప్రాంతం మొత్తం బూడిదమయంగా మారింది. ఇళ్లు, రహదారులు, వాహనాలు బూడిదతో కప్పినట్లు తయారయ్యాయి. ఎనిమిది అంగులాల మందం బూడిద పొరతో పంటలు నాశనమయ్యాయి. జంతువులు మృతిచెందగా, నీరు కాలుష్యమైంది. గతవారం విస్ఫోటనం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 20 వేల మందిని ఈ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు లక్ష మంది ప్రజలు ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తాలూకు ప్రభావం కొన్ని నెలల పాటు ఉంటుందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని