కరోనా బాధితుల్లో 3నెలల వరకు యాంటీబాడీలు

కరోనా రోగుల్లో కనీసం 3నెలల వరకు యాంటీబాడీలు ఉంటాయని శాస్ర్తవేత్తలు గుర్తించారు.

Updated : 29 Feb 2024 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా రోగుల్లో కనీసం 3నెలల వరకు యాంటీబాడీలు ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు సహా పలువురు పరిశోధకులు ఈ మేరకు జర్నల్‌ సైన్స్‌లో కథనాన్ని ప్రచురించారు. 343 మంది కరోనా రోగుల్లోని రక్తంలో ఉన్న యాంటీబాడీల కదలికలపై దృష్టి పెట్టగా, వైరస్‌ లక్షణాలు తేలిన తరువాత 122 రోజుల పాటు పరిశీలించి పరిశోధకులు ఈ ఫలితాలను వెల్లడించారు. వైరస్‌ను గుర్తించడంలో ప్రత్యామ్నాయ పరీక్ష విధానానికి తాజా పరిశోధన దోహదం చేయనుంది. యాంటీబాడీ పరీక్ష కోసం లాలాజలాన్ని ప్రత్యామ్నాయ బయో ఫ్లూయిడ్‌గా వినియోగించవచ్చని ఈ కథనంలో తెలిపారు. యాంటీబాడీలను ఐజీజీ, ఐజీఏ, ఐజీఎంలుగా వర్గీకరించిన పరిశోధకులు వీటిలో ఐజీజీ రకం యాంటీబాడీ రక్తం.. లాలాజలంలో ఎక్కువ కాలం ఉంటుందని గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని