Sankranti Busses: సంక్రాంతి రద్దీ.. బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కేసులు

సంక్రాంతి (Sankranti) రద్దీ సమయంలో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ప్రైవేట్‌ ట్రావెల్స్‌  (Private Travels Buses) నిర్వాహకులను రవాణాశాఖ అధికారులు హెచ్చరించారు.

Updated : 09 Jan 2023 17:59 IST

అమరావతి: సంక్రాంతి (Sankranti) రద్దీ వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల (Private Travels Buses) దోపీడీపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాల డీటీసీలతో రవాణా శాఖ కమిషనర్‌ ఆంజనేయులు సమావేశమయ్యారు. సంక్రాంతి (Pongal Sesason) రద్దీ వేళ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు తనిఖీ చేయాలని ఆదేశించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేట్‌ బస్సుల్లో 10 రోజులపాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫిట్‌నెట్‌, ఇతర ధ్రువపత్రాలు లేని బస్సులు సీజ్‌ చేస్తామని తెలిపారు. గమ్యస్థానం చేరాకే బస్సులను సీజ్‌ చేయాలని నిర్ణయించారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌లో వసూలు చేసే ఛార్జీలు చూసి కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రయాణికులు కూడా రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. రవాణాశాఖ వెబ్‌సైట్‌లోని ఫోన్‌ నెంబర్లకు కూడా ఫిర్యాదు చేయచ్చన్నారు. ‘‘గతేడాది 975 కేసులు, రూ.62 లక్షల జరిమానా విధించాం. తీవ్రతను బట్టి కేసులు నమోదు చేసి ప్రాసిక్యూషన్‌ చేస్తాం. ఆర్టీసీ బస్టాండ్ల వద్దకు ప్రైవేట్‌ బస్సులు రాకుండా చర్యలు తీసుకుంటాం. సంబంధంలేని లగేజీ తరలించే ప్రైవేట్‌ బస్సులపై కేసులు నమోదు చేస్తాం. కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ బస్సులను స్టేజ్‌ క్యారియర్లుగా తిప్పడం నేరం’’ అని వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని