మేమే నయం.. అంటున్న కుక్క, పిల్లి

ఉప్పు, నిప్పులా ఉండే జంతువులు జాతి వైరాన్ని మరచి ప్రాణ స్నేహితుల్లా మారాయి.

Published : 11 Jan 2021 23:51 IST

సూర్యాపేట: మామూలుగా ఐతే ఉప్పు, నిప్పులా ఉండే జంతువులు జాతి వైరాన్ని మరచి ప్రాణ స్నేహితుల్లా మారాయి. ఒకే కంచంలో తింటూ.. ఒకే చోట నిద్రిస్తున్నాయి. ఈ విభిన్న సంఘటన తెలంగాణ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన తుమ్మా అరవయ్య అనే వ్యక్తి తన ఇంట్లో ఓ కుక్కను, పిల్లిని పెంచుకుంటున్నారు. ఆ రెండూ చిన్నతనం నుంచి కలసి ఉంటూ చెలిమి చేస్తున్నాయి. రోజూ సరదాగా ఆడుకుంటూ గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జాతి వైరం గల జంతువులే ఈ విధంగా సఖ్యంగా మెసులుతూ ఉంటే.. మనుషులు మాత్రం తమలో తామే కుల, మతాల పేరుతో మానవత్వాన్ని మరచిపోతున్నారని స్థానికులు అంటున్నారు.

ఇవీ చూడండి..

జంతు ప్రపంచపు సిత్రాలు..

 కోతి పరార్‌.. వృద్ధుని తిప్పలు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని