Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?

గుండె ఉండేది గుప్పెడంతే..అదే మనకు ప్రాణాధారం..అది సరిగా లేకపోతే ప్రాణమే నిలవదు. ఎప్పుడు గుండె ఆగిపోతుందోనని భయపడుతాం. నిరంతరాయంగా, నిర్విరామంగా పని చేస్తేనే మనం ఏ పనైనా చేసుకోగలం..ఇలాంటి గుండెను సక్రమంగా ఉంచుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం.

Published : 11 Aug 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుండె ఉండేది గుప్పెడంతే..అదే మనకు ప్రాణాధారం..అది సరిగా లేకపోతే ప్రాణమే నిలవదు. ఎప్పుడు గుండె ఆగిపోతుందోనని భయపడుతాం. నిరంతరాయంగా, నిర్విరామంగా పని చేస్తేనే మనం ఏ పనైనా చేసుకోగలం..ఇలాంటి గుండెను సక్రమంగా ఉంచుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. పొగ, మద్యంతో పాటు జీవనశైలిలో మార్పులతో ప్రమాదంలో పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో గుండెకు వచ్చే ఇబ్బందులు, పరిష్కార మార్గాల గురించి ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ వి.హరిరామ్‌ వివరించారు.

ఇవే కారణం: అదుపు లేని రక్తపోటుతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నియంత్రణలో లేని మధుమేహంతోనూ సమస్యలు వస్తాయి. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండటం, పొగ, మద్యం తాగేవారికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఊబకాయం ఉండి వ్యాయామం చేయకపోవడం సరికాదు. కుటుంబ నేపథ్యంలో గుండెపోటు వచ్చిన సందర్భాలుంటే జాగ్రత్తగా ఉండాలి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని