YS Avinash Reddy: ఎంపీ అవినాష్‌ లేఖపై సీబీఐ రిప్లై... 19న విచారణకు రావాలని నోటీసులు

వివేకా హత్య కేసులో (Viveka Murder case) వైఎస్‌ అవినాష్‌రెడ్డికి (Avinash Reddy) సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది.  షార్ట్‌ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం కావాలని అవినాష్‌ రెడ్డి కోరడంతో ఈ నెల 19న విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

Updated : 16 May 2023 15:10 IST

హైదరాబాద్:  విచారణకు నాలుగు రోజులు సమయం కోరిన ఎంపీ అవినాష్‌ రెడ్డి ( MP Avinash Reddy) లేఖపై సీబీఐ స్పందించింది. వాట్సాప్‌ ద్వారా మరోసారి నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో ఈనెల 19న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఎంపీ అవినాష్‌.. హైదరాబాద్‌ నుంచి పులివెందుల వెళ్తుండగా మార్గమధ్యంలో సీబీఐ నోటీసులు పంపింది. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద సోమవారం ఎంపీ అవినాష్‌కు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున విచారణకు సమయం కోరుతూ లేఖ రాశారు.

షార్ట్‌ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం ఇవ్వాలని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చెప్పారు. మరో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని.. అందుకే విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని సీబీఐకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అనంతరం అవినాష్‌ పులివెందుల బయల్దేరి వెళ్లారు.  ఇప్పటికే పలుమార్లు అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ.. గత 20 రోజులుగా విచారణ చేపట్టలేదు. తాజాగా కడప ఎంపీకి నోటీసులిచ్చి విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  వివేకా కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర, ప్రమేయంపై ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కౌంటర్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో భారీ కుట్రకు అవినాష్‌, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి పాల్పడ్డారని పేర్కొన్న విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు