CBI-ED: జగన్‌ అక్రమాస్తుల కేసు: వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ 

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని విశ్రాంత ఐఏఎస్‌లు జి.వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్‌పై న్యాయస్థానం

Updated : 16 Sep 2021 21:54 IST

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని విశ్రాంత ఐఏఎస్‌లు జి.వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్‌పై న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వాన్‌పిక్‌, దాల్మియా, జగతి పబ్లికేషన్స్‌, రాంకీ కేసుల విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. రాంకీ ఈడీ కేసు నుంచి తొలగించాలని కోరుతూ సీఎం జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లు దాఖలు చేశారు. రాంకీ ఈడీ కేసు విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్‌పై ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు విచారణ జరిగింది. మొదట ఈడీ కేసుల విచారణపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న విజయసాయి అభ్యర్థనపై ఈడీ మరోసారి అభ్యంతరం తెలిపింది. స్టే లేనందున విచారణకు షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఈడీ కోరింది. జగతి పబ్లికేషన్స్‌పై ఈడీ కేసు విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. సీబీఐ కోర్టు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసిన తర్వాత వి.డి.రాజగోపాల్‌ కోర్టుకు హాజరయ్యారు. రూ.5వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడంతో  ఆయనపై జారీ చేసిన ఎన్‌బీడబ్ల్యూను సీబీఐ కోర్టు ఉపసంహరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని