జగన్‌, విజయసాయి వాదనలకు సిద్ధం కావాలి: సీబీఐ కోర్టు

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జగన్‌,

Updated : 28 Jul 2021 20:49 IST

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జగన్‌, విజయసాయిరెడ్డిని కోర్టు ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది.

ఈడీ కేసులను మొదట విచారణ జరపాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందని విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. అప్పటి వరకు వాయిదా వేయాలన్న అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు 6కి వాయిదా వేసింది. ఎమ్మార్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులపై విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు