AP News: వైకాపా నేతలను విచారించిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పదో రోజు సీబీఐ విచారణ కొనసాగింది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ముగ్గురు అనుమానితులను..

Updated : 16 Jun 2021 13:39 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పదో రోజు సీబీఐ విచారణ కొనసాగింది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ముగ్గురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా నేతలు లక్ష్మీకర్‌, రమణ.. సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు. జగదీశ్వర్‌రెడ్డి గతంలో వివేకాకు పీఏగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

మంగళవారం వివేకాకు అత్యంత సన్నిహితుడైన సునీల్‌కుమార్‌ యాదవ్‌ తండ్రి కృష్ణయ్యయాదవ్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఆయన కుమారులు సునీల్‌కుమార్, కిరణ్‌కుమార్‌ యాదవ్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. వివేకాతో ఎలా మెలిగేవారని, ఎన్ని గంటలకు ఇంటికి వచ్చేవారని, హత్య జరిగిన రోజు ఎక్కడున్నారని ఆరా తీశారు. కృష్ణయ్యయాదవ్‌ చెప్పిన వివరాలను అధికారులు రికార్డు చేశారు. సీబీఐ అధికారులు విచారణ మొత్తాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని