CBI: ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. 7గంటలపాటు అవినాష్ సీబీఐ విచారణ
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను సీబీఐ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం 9.40 నిమిషాలకు తన న్యాయవాదులతో కలిసి ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. 10.30 గంటల సమయంలో సీబీఐ అధికారులు కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించారు. దాదాపు 7గంటలపాటు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగింది.
జూన్ 30వ తేదీ వరకు ప్రతి శనివారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించి వాంగ్మూలం నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఎవరెవరితో అవినాష్ మాట్లాడారనే విషయాలను అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల సమయంలో విచారణ ముగియడంతో అవినాష్ రెడ్డి తిరిగి కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Khalistani ఉగ్ర కుట్రలు.. మాస్టర్ మైండ్ ‘పన్నూ’..!
-
Visakhapatnam: విశాఖలో తెదేపా మెరుపు నిరసన
-
Rahul Gandhi: బిలాస్పూర్ To రాయ్పూర్.. ట్రైన్లో ప్రయాణించిన రాహుల్
-
Singer Damini: బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యకర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!