Viveka Murder Case: పులివెందులకు సీబీఐ అధికారులు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి గురించి ఆరా!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి గురించి ఆరా తీశారు.

Published : 23 Jan 2023 16:44 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు వెళ్లారు. పులివెందుల వైకాపా కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి గురించి ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారు వెనుదిరిగారు. అనంతరం పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, ఆయన భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌ బదిలీ చేస్తున్నట్లు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎం.ఆర్‌.షా పేర్కొన్నారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని