Viveka Murder Case: ఏప్రిల్ 15 నాటికి దర్యాప్తు పూర్తిచేస్తాం: సుప్రీంకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అధికారి మార్పుపై ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు సీబీఐ అందజేసింది. ప్రస్తుత దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్‌ను కొనసాగిస్తూ సీబీఐ ప్రతిపాదనలు అందించింది.
దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు అధికారి మార్పుపై ప్రతిపాదనలను సుప్రీంకోర్టుకు సీబీఐ అందజేసింది. ప్రస్తుత దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్‌ను కొనసాగిస్తూ సీబీఐ ప్రతిపాదనలు అందించింది. రామ్‌సింగ్‌ను కొనసాగించడంపై న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతి సాధించనపుడు ఆయన్ను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. న్యాయమూర్తి అభ్యంతరం నేపథ్యంలో రామ్‌సింగ్‌తో పాటు మరో పేరును సీబీఐ సూచించింది. ఏప్రిల్ 15వ తేదీ నాటికి వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు దర్యాప్తు సంస్థ నివేదించింది.
మరోవైపు కేసు విచారణ ఆలస్యమవుతున్నందున ఏ5 నిందితుడు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన భార్య తులసమ్మ కోర్టును కోరారు. కొత్త అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు సమయం పడుతుందని.. ఈలోపు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులసమ్మ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని.. మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!
-
World News
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. ముందస్తు బెయిల్ గడువు పొడిగింపు
-
World News
జపాన్‌లో జన సంక్షోభం.. రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు!
-
Crime News
Train accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. ఏపీలో హెల్ప్‌లైన్ నంబర్లు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
India News
Train Accident: రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి