Viveka murder case: సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ

సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ను కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో 6.30గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. 

Updated : 03 Feb 2023 18:36 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌ను  కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో 6.30గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. అవినాష్‌ రెడ్డి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్‌ రెడ్డితో పాటు నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ  క్రమంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో  సీబీఐ విచారణకు ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎవరెవరు ఫోన్‌ చేశారు? ఏం మాట్లాడారు? మీతోనే మాట్లాడారా .. ఇంకెవరికైనా ఫోన్‌ ఇచ్చారా? అనే అంశాలపై సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని