CBI: గుంతకల్లు రైల్వే DRM ఆఫీస్‌లో ముగిసిన సోదాలు.. సీబీఐ అదుపులో 8 మంది

గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సీబీఐ సోదాలు చేసింది. రైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి.

Updated : 06 Jul 2024 11:40 IST

గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సీబీఐ సోదాలు చేసింది. రైల్వే డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌ నివాసంలో తనిఖీలు పూర్తయ్యాయి. అక్కడ భారీగా బంగారం, నగదు పట్టుబడింది. 8 మంది సిబ్బందిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఆర్‌ఎం వినీత్‌సింగ్‌, డీఎఫ్‌ఎం ప్రదీప్‌ బాబు, సిబ్బంది రాజు, ప్రసాద్‌, బాలాజీ సీబీఐ అదుపులో ఉన్నారు. నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వారిని సీబీఐ కోర్టుకు తరలించనున్నారు.

గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలో భాగమైన ఆర్థిక విభాగంలో సికింద్రాబాద్‌కు చెందిన సీబీఐ అధికారులు గురువారం దాడులు చేశారు. ఆర్థిక విభాగంలో పని చేస్తున్న సీనియర్‌ డివిజన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌(డీఎఫ్‌ఎం) ప్రదీప్‌బాబుతో పాటు మరికొందరు సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు గత మూడు రోజుల నుంచి గుంతకల్లులో మకాం వేశారు. కదిరి ప్రాంతంలో రైల్వే మోరీ పనులకు సంబంధించి ఆ ప్రాంతానికి చెందిన గుత్తేదారులకు పనిని అప్పగించడానికి ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రదీప్‌బాబుతో పాటు కొందరు సిబ్బంది డబ్బును డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని