CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ

హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ అధికారులు లేఖ రాశారు. మొయినాబాద్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాలు ఇవ్వాలని సీబీఐ కోరింది. 

Published : 08 Feb 2023 19:04 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందకు సీబీఐ సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ అధికారులు లేఖ రాశారు. మొయినాబాద్‌ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ వివరాలు ఇవ్వాలని సీబీఐ కోరింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సీజే ధర్మాసనంలో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. ప్రభుత్వం వేసిన పిటిషన్‌ తమ పరిధిలోకి రాదని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలు ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు డిసెంబరు 31, జనవరి 5, 9, 11, 26 తేదీల్లో లేఖలు రాశారు. తాజాగా రెండ్రోజుల క్రితం సీబీఐ ఎస్పీ.. సీఎస్‌ శాంతికుమారికి లేఖ రాశారు. కేసు దర్యాప్తు బాధ్యతను.. దిల్లీ విభాగానికి సీబీఐ డైరెక్టర్‌ అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని