CTET 2022 results: సీటెట్‌ ఫలితాలు విడుదల.. ఈసారి 9.5లక్షల మంది క్వాలిఫై!

సీటెట్‌ ఫలితాల్లో(Ctet 2022 results) 9.5లక్షల మంది క్వాలిఫై అయినట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. డిసెంబర్‌-ఫిబ్రవరి మధ్యలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.

Updated : 03 Mar 2023 19:13 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-2022) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను శుక్రవారం సీబీఎస్‌ఈ విడుదల చేసింది. డిసెంబర్‌ 28 నుంచి ఫిబ్రవరి 7వరకు జరిగిన పరీక్షల్లో ఈసారి పేపర్‌- 1కు 17,04,282మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 14,22,959మంది హాజరయ్యారు. వీరిలో 5,79,844మంది అర్హత సాధించినట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఇక, పేపర్‌- 2 విషయానికి వస్తే 15,39,464మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా..  12,76,071 మంది హాజరయ్యారు. వీరిలో 3,76,025 మంది అర్హత సాధించారు. రెండు పేపర్లు కలిపి మొత్తంగా 9.5లక్షల మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థులు తమ రోల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్షను డిసెంబర్‌ 28, ఫిబ్రవరి 7వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని ఫిబ్రవరి 14న వెబ్‌సైట్‌లో ఉంచారు. దీనిపై ఫిబ్రవరి 17వరకు అభ్యంతరాలు స్వీకరించారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

ఫలితాలు ఇలా తెలుసుకోండి..

  • ctet.nic.inవెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • Ctet ఫలితాలపై క్లిక్‌ చేయాలి
  • మీ రోల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి
  • రిజల్ట్‌/స్కోర్‌ కార్డును చెక్‌ చేసుకొని డౌన్‌లోడ్‌ చేసుకోండి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని