CBSE: రెండు భాగాలుగా సిలబస్‌..!

విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఒక్కో భాగంలో 50 శాతం సిలబస్‌ను చేర్చనున్నట్లు......

Updated : 15 Oct 2022 16:40 IST

దిల్లీ: విద్యా సంవత్సరానికి సంబంధించి సీబీఎస్ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరాన్ని రెండు అర్ధ భాగాలుగా విభజిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఒక్కో భాగంలో 50 శాతం సిలబస్‌ను చేర్చనున్నట్లు తెలిపింది. తొలి భాగానికి సంబంధించిన పరీక్షలను నవంబరు- డిసెంబర్‌లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించనున్నట్లు వివరించింది. అదేవిధంగా రెండో భాగం పరీక్షలను మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించనన్నట్టు తెలిపింది. 10, 12 తరగతులకు బోర్డు నిర్వహించే పరీక్షలు విద్యా సంవత్సరం చివరికల్లా పూర్తి చేసేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. 

కొత్త విధానం ప్రకారం..  2021-22 విద్యా సంవత్సరానికి సిలబస్‌ను రెండు భాగాలుగా విభజిస్తారు. నిపుణుల ఆధ్వర్యంలో ఓ క్రమ పద్ధతిలో పాఠ్యాంశాలను ప్రతి భాగానికి కేటాయిస్తారు. విభజించిన సిలబస్‌ ఆధారంగా ప్రతి అర్ధభాగం చివర్లో పరీక్షలు నిర్వహిస్తారు. సిలబస్‌, పాఠ్య ప్రణాళికలకు సంబంధించి మార్చి 31న సీబీఎస్ఈ విడుదల చేసిన మార్గదర్శకాలను పాఠశాలలు పాటించాల్సి ఉంటుంది. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌, ప్రాక్టికల్‌ పరీక్షలను సైతం మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ కసరత్తు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని