Tirupati: మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు

సీఎం చంద్రబాబు (Chandrababu) మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Updated : 14 Jun 2024 15:35 IST

తిరుపతి: సీఎం చంద్రబాబు (Chandrababu) మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయడంతో ఏపీ వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 16,347 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావడంతో టీచర్‌ పోస్టుల కోసం తమ ఐదేళ్ల నిరీక్షణ ఫలించిందని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని