ఎన్వీ రమణ ప్రమాణం.. పొన్నవరంలో సంబురాలు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం చేసిన వేళ.. ఆయన స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా వీరుల్లపాడు మండలం పొన్నవరం గ్రామస్థులు కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు....

Published : 24 Apr 2021 13:18 IST

పొన్నవరం: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం చేసిన వేళ.. ఆయన స్వగ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామస్థులు కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ సంబరాల్లో యువకులు, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి మౌలిక వసతులు లేని ఈ కుగ్రామానికి చెందిన వ్యక్తి కష్టపడి చదివి దేశంలోని అత్యున్నత పదవిని అదిష్టించడం గర్వంగా ఉందని ఎన్వీ రమణ కుటుబంసభ్యులు, పొన్నవరం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మా గ్రామస్థుడు అత్యున్నత పదవిలో ఉండటం మా గ్రామానికే గర్వకారణమని వారు హర్షం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని