Updated : 14 Mar 2021 14:39 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

హైదరాబాద్‌: తెలంగాణలోని రెండు స్థానాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఉదయాన్నే షేక్‌పేట్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉప్పరపల్లిలో ఎమ్మెల్సీ ఓటు వేశారు. మంత్రి మహమూద్‌ అలీ మలక్‌పేట్‌లో ఓటు వేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓటేశారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరంగల్‌ గ్రామీణ వేలేరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరిలో కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ఓటు వేశారు.

జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్‌ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లో ఆమె ఓటేశారు. ఖమ్మం సిద్ధార్థ కళాశాలలో మంత్రి పువ్వాడ అజయ్‌ ఓటేశారు. ఓటేశారు. 

తార్నాకలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావు ఓటుహక్కును వినియోగించుకున్నారు. హన్మకొండ ఆర్ట్స్‌కళాశాలలో భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఓటు వేశారు. నర్సంపేటలో యువ తెలంగాణ అభ్యర్థి రాణిరుద్రమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెడ్‌హిల్స్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనగామా జిల్లా రఘునాథపల్లిలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు వేశారు. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని