సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5వేల అప్రెంటిస్ ఖాళీలు.. స్టైఫండ్‌ ఎంతంటే?

central bank of India: సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 21 Mar 2023 15:24 IST

ముంబయి: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు సెంట్రల్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Central bank of India) అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ శిక్షణలో భాగంగా 5000 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ/తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ రెండో వారంలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీ నుంచి 141 (విజయవాడ రీజన్‌లో 41, గుంటూరు 60, విశాఖ 40చొప్పున) ఖాళీల్ని భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 106(హైదరాబాద్‌ 65, వరంగల్‌ 41 చొప్పున) భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

ముఖ్యాంశాలివే.. 

  • దరఖాస్తులు ప్రారంభం: మార్చి 20న
  • దరఖాస్తులకు తుది గడువు: ఏప్రిల్‌ 3
  • శిక్షణ కాలం: ఒక ఏడాది పాటు ఉంటుంది.
  • స్టైఫండ్‌: రూరల్‌/సెమీ అర్బన్‌ బ్రాంచ్‌లలో నెలకు రూ.10వేలు, అర్బన్‌ బ్రాంచుల్లో రూ.12000, మెట్రో శాఖల్లో అయితే రూ.15000 చొప్పున ఇవ్వనున్నారు. దీనికితోడు ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఖర్చుల కోసం కొంత మొత్తం ఇస్తారు. 
  • వయోపరిమితి: మార్చి 31 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది. 
  • పరీక్ష ఫీజు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకైతే రూ.800;  దివ్యాంగుంగులైతే రూ.400, ఎస్సీ/ఎస్టీ/మహిళలకు రూ.600లుగా నిర్ణయించారు. ఈ ఫీజుకు జీఎస్టీ అదనం. 
  • పరీక్షవిధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిట్‌నెస్‌ పరీక్ష, స్థానిక భాషలో ప్రావీణ్యతను చూస్తారు. 

పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని