Drgus: ఏపీలోనే మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ అధికం: కేంద్రం నివేదిక

దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఏపీలోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

Published : 05 Dec 2022 16:45 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 2021-22లో అత్యధికంగా ఏపీలోనే మాదకద్రవ్యాలు లభ్యమైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశంలో 2021-22లో పట్టుబడిన మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాలపై ‘స్మగ్లింగ్‌ ఇన్‌ ఇండియా’ 2021-22 పేరుతో కేంద్రం నివేదిక విడుదల చేసింది. ఒక్క ఏపీలోనే 18వేల కిలోల మాదకద్రవ్యాలు, వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా రూ.97 కోట్ల విలువైన 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్‌, మత్తు పదార్థాలు పట్టుబడినట్లు నివేదికలో పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తంగా 2021-22లో కస్టమ్స్‌ విభాగం రూ.17,394 కోట్ల విలువైన డ్రగ్స్‌, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగం రూ. 20,064 కోట్ల విలువైన డ్రగ్స్‌, రూ.1,323 కోట్ల విలువైన బంగారం, విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తన నివేదికలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని