TS news: పంజాబ్‌లో ధాన్యం కొన్నట్టే తెలంగాణలోనూ కొనాలి: నిరంజన్‌రెడ్డి

ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ) వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ‘‘ 3 లక్షల కోట్ల టన్నుల బియ్యం వృథాగా ఉన్నాయని గడ్కరీ చెప్పారు. రైతులను..

Published : 09 Nov 2021 18:47 IST

హైదరాబాద్‌: ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ‘‘ 3 లక్షల కోట్ల టన్నుల బియ్యం వృథాగా ఉన్నాయని గడ్కరీ చెప్పారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని కోరారు. ధాన్యం కొనలేమని కేంద్రం లేఖల ద్వారా రాష్ట్రానికి చెప్పింది. అదే విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఇన్నాళ్లూ కేంద్రం బాయిల్డ్‌ రైసు తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమేనని విమర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోనే డబ్బు చెల్లిస్తే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోందని మండిపడ్డారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని